మాజీ సీఎం అందించిన 2 లక్షల రూపాయల నోట్లను విసిరేసిన మహిళ

ABN , First Publish Date - 2022-07-16T01:15:54+05:30 IST

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందజేసిన 2 లక్షల రూపాయల నోట్లను ఓ మహిళ విసిరేసిన ఘటన బగల్‌కోట్‌లో చోటు చేసుకుంది.

మాజీ సీఎం అందించిన 2 లక్షల రూపాయల నోట్లను విసిరేసిన మహిళ

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి Siddaramaiah అందజేసిన 2 లక్షల రూపాయల నోట్లను ఓ మహిళ విసిరేసిన ఘటన బగల్‌కోట్‌లో చోటు చేసుకుంది. ఇటీవల కెరూర్‌ మత ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు Siddaramaiah బాదామి నియోజకవర్గాన్ని సందర్శించారు. జులై 7న కెరూర్‌ మత ఘర్షణలో గాయపడిన వారికి సహాయ చెక్కులను అందజేశారు. అయితే బాధితుల కుటుంబసభ్యులు ఆ చెక్కులను తీసుకునేందుకు నిరాకరించారు. సహాయ చెక్కులకు బదులుగా తమకు న్యాయం కావాలని కోరారు. ఈ విషయంపై ఆయన మాట్లాడాతానని చెప్పినా క్షతగాత్రుల కుటుంబసభ్యులు పట్టించుకోలేదు.. తమకు న్యాయం కావాలని పట్టుబట్టారు. ఆ తర్వాత సిద్ధరామయ్య అక్కడి నుంచి బాధితులు ఉన్న ఆస్పత్రికి బయల్దేరారు. ఈ సమయంలోనే ఓ మహిళ డబ్బుల కట్టలను కాన్వాయ్‌ వైపు విసిరింది. అవి కాన్వాయ్‌లోని ఒక పోలీస్ వాహనానికి తగిలాయి. అక్కడి నుంచి ఆశీర్వాద్ ఆస్పత్రికి వెళ్లిన సిద్ధరామయ్య గాయపడిన హనీఫ్‌, రాజేసాహెబ్, రఫీక్ మరియు దావల్ మాలిక్‌ను పరామర్శించారు. వారి ఆరోగ్య నివేదికను పరిశీలించారు. 


మరోవైపు జులై 7న రెండు వేర్వేరు వర్గాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం హింస‌కు దారి తీసింది. ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. బాదామి సమీపంలోని కెరూర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.



Updated Date - 2022-07-16T01:15:54+05:30 IST