10 వేలకు పైగా తగ్గిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-11T16:09:35+05:30 IST

రాష్ట్రంలో వారంరోజుల వైరస్‌ బాధితుల నమోదును పరిశీలిస్తే సోమవారం పదివేల దాకా తగ్గుముఖం పట్టినట్టయ్యింది. ఇటీవల వరుసగా 50 వేలమందికిపైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం

10 వేలకు పైగా తగ్గిన కరోనా కేసులు


బెంగళూరు: రాష్ట్రంలో వారంరోజుల వైరస్‌ బాధితుల నమోదును పరిశీలిస్తే సోమవారం పదివేల దాకా తగ్గుముఖం పట్టినట్టయ్యింది. ఇటీవల వరుసగా 50 వేలమందికిపైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 39,305 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో 19.73లక్షలమంది కొవిడ్‌ బాధితులయ్యా రు. బెంగళూరులో 16,747 మంది, తుమకూరులో 2,168 మంది, హాసన్‌ 1800, మైసూరు 1537, మండ్య 1133, ధార్వాడ 1006, దక్షిణకన్నడ 1175, బళ్ళారి 973, బాగల్కోటె 968, కలబుర్గి 988 మంది కాగా మిగిలిన జిల్లాల్లో 900 లోపు కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. 32,188 మంది తాజాగా డిశ్చా ర్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 13.83 లక్షలమంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. అయితే మృతుల సం ఖ్యలో ఏమాత్రం తేడా లేదనిపిస్తుంది. 596 మంది రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందగా బెంగళూరులో 374 మంది, బళ్ళారి లో 24మంది, హాసన్‌లో 22 మంది మృతి చెందారు. బాగల్కోటె, తుమకూరులలో 15 మంది చొప్పున మృతి చెందగా ఇతర జిల్లాల్లో 13 మంది లోపు మృత్యువాత చెందారు. కొ ప్పళ జిల్లాలో మాత్రమే ఒకరు కూడా మృతి చెందలేదు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 5.71 లక్షలమంది కొవిడ్‌తో చికిత్స  పొందుతున్నారు. బెంగళూరులోనే 3.52 లక్షలమంది ఉన్నారు. 

Updated Date - 2021-05-11T16:09:35+05:30 IST