బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 378 కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారని కర్ణాటక వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో 8,891 మంది కరోనా రోగులున్నారు. బెంగళూరు నగరంలోనే 195 కరోనా కేసులు వెలుగుచూశాయి. బెంగళూరు అర్బన్ తర్వాత దక్షిణ కన్నడ జిల్లాలో 24 మందికి కరోనా సోకింది. దేశంలో శనివారం 16,326 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.