హంతకుడిని పట్టిచ్చిన హీరో కుక్క! ఏకంగా 12 కీలోమీటర్లు వెంబడించి..

ABN , First Publish Date - 2020-07-21T16:44:38+05:30 IST

కుక్క కరాణంగా హంతకుడి అరెస్ట్

హంతకుడిని పట్టిచ్చిన హీరో కుక్క!  ఏకంగా 12 కీలోమీటర్లు వెంబడించి..

బెంగళూరు: అది ఓ పోలీసు జాగిలం.. ఏకంగా 12 కీమీల దూరం వరకూ నేరస్తుడిని వెంబడించి మరీ హత్య కేసును ఛేదించింది. రాజధాని బెంగళూరుకు 260 కీమీల దూరంలో ఉన్న బసవపట్టన అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల తొలివారంలో చంద్రనాయక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.


అంతకుమునుపు అతడు చేతన్ అనే వ్యక్తి నుంచి రూ. 1.7 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ విషయంలో ఇటీవల వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే తన నేర చరిత్ర గురించి చంద్ర నాయక్‌కు తెలిసిపోయిందని, త్వరలో అతడు తనను పోలీసులకు పట్టిస్తాడని చేతన్ భయపడిపోయాడు. ఈ క్రమంలోనే అతడు చంద్రనాయక్‌కు తుపాకీతో కాల్చి చంపాడు.


ఈ హత్యకు వినియోగించిన తుపాకీ గతంలో పోలీస్ స్టేషన్‌ నుంచి దొంగిలించినది. మరోవైపు.. ఈ దారుణం జరిగిన వారంపైనే అవుతున్నా చేతన్ ఎక్కుడున్నాడో పోలీసులు తెలుసుకోలేక పోయారు. అడుగు మందుకు పడట్లేదు. ఈ తరుణంలోనే వారు తమకు నమ్మినబంటైన తుంగాను రంగంలోకి దింపారు. తుంగా..పదేళ్ల వయసున్న పోలసు జాగిలం. ఇప్పటి వరకూ 50 మర్డర్ కేసులు, 60 దొంగతనాల కేసులను ఛేదించిన అనుభవశాలి.


దీంతో పోలీసులు..తుంగను చేతన్ చివరిసారిగా తిరుగాడిన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తుంగ మరో 12 కీమీల మేర వాసనను అనుసరిస్తూ వెళ్లి ఓ ఇంటి వ్దద ఆగింది. ఇంట్లోని వారు తమకేమీ తెలీదంటూ తొలుత బుకాయించినప్పటికీ..ఇంట్లోనే దాక్కున చేతన్.. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే వారు అతడిని స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీసులు చేతన్‌ను తమదైన శైలిలో ప్రశ్నించగా తుపాకీని తానే దొంగతనం చేశానని, చంద్ర నాయక్‌ను హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతొ తుంగ మరోసారి క్లిష్టమైన కేసుకు ముగింపు పలికినట్టైంది. ఆ జాగిలం మా హీరో.. అంటూ కర్ణాటక అదనపు డీజీపీ కూడా తుంగపై ప్రశంసల వర్షం కురిపించారు  

Updated Date - 2020-07-21T16:44:38+05:30 IST