అమరావతి రైతుల పోరాటానికి కర్ణాటక ప్రవాసాంధ్రుల బాసట

ABN , First Publish Date - 2021-12-10T17:40:20+05:30 IST

చారిత్రాత్మక అమరావతి రాజధాని కోసం ఏడాదికిపైగా అవిశ్రాంత పోరు జరుపుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతులు చేపట్టిన మహాపాదయాత్ర గురువారం శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటకలో

అమరావతి రైతుల పోరాటానికి కర్ణాటక ప్రవాసాంధ్రుల బాసట

                      - పోరాట సమితికి రూ.10 లక్షల విరాళం


బెంగళూరు: చారిత్రాత్మక అమరావతి రాజధాని కోసం ఏడాదికిపైగా అవిశ్రాంత పోరు జరుపుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతులు చేపట్టిన మహాపాదయాత్ర గురువారం శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటకలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు బెంగళూరు కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో బాసటగా నిలబడ్డారు. యాత్రలో పాల్గొని రైతులలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో అమరావతి రైతుల ఈ సుధీర్ఘ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది అనడంలో సందేహం లేదని బెంగళూరు కమ్మవారిసంఘం పదాధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక పోరాటానికి తమ సంఘం సదా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోట్లాదిమంది తెలుగు ప్రజల అమరావతి రాజధాని ఆకాంక్ష సాకారం కావాలన్న సంకల్పంతోనే తాము కూడా స్వయంగా పాల్గొన్నట్టు తెలిపారు. ఇదే సందర్భంగా అమరావతి పోరాట సమితికి రూ.10 లక్షల విరాళాన్ని అందచేశారు. 

Updated Date - 2021-12-10T17:40:20+05:30 IST