దాడుల్లో దళితులు మృతి చెందితే కుటుంబీకులకు కారుణ్య నియామకాలు

ABN , First Publish Date - 2022-05-13T18:16:59+05:30 IST

రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులలో దళితులు మృతి చెందితే వారి కుటుంబీకులలో అర్హత కలిగినవారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. సీఎం

దాడుల్లో దళితులు మృతి చెందితే కుటుంబీకులకు కారుణ్య నియామకాలు

- కేబినెట్‌ కీలక నిర్ణయం

- మతమార్పిడి నిషేధ బిల్లుకు ఆర్డినెన్స్‌


బెంగళూరు: రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులలో దళితులు మృతి చెందితే వారి కుటుంబీకులలో అర్హత కలిగినవారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. సీఎం బసవరాజ్‌బొమ్మై అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ తీర్మానాలను శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి మాధుస్వామి మీడియాకు వివరించారు. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా దౌర్జన్యాలలో దళితులు దుర్మరణం చెందితే వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. శాసనసభలో ఆమోదింపబడి పరిషత్‌లో పెండింగ్‌లో ఉండే మతమార్పిడి నిషేధ బిల్లుకు ఆర్డినెన్స్‌ జారీ చేశారు. బిల్లును గవర్నర్‌ ఆమోదానికై రాజభవన్‌కు బిల్లును పంపేందుకు తీర్మానించారు. రైతులకు డీజిల్‌కు ఎకరాకు రూ. 250లు సబ్సీడీ ఇచ్చేందుకు తీర్మానించారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన గోడౌన్‌ల నిర్మాణాలకు నాబార్డు నుంచి రూ.860 కోట్లు రుణం తీసుకునేలా తీర్మానించామన్నారు. తలసేమియా, హిమోఫీలియా బాధితులకు ఉచితంగా మందులు ఇచ్చేందుకు తీర్మానించామన్నారు. ఇందుకు గాను రూ.15కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఎగువ భధ్రా నుంచి రూ.1300ల కోట్లతో పైప్‌లైన్‌ల ద్వారా తాగునీటిని సమకూర్చేందకు అంగీకరించామన్నారు. తద్వారా చిక్కమగళూరులో 146 గ్రా మాలు, తరకేరి పరిధిలో 156, హొసదుర్గ పరిధిలో 346 గ్రామాలకు నీరు సమకూర్చదలచామన్నారు. బెంగళూరు పరిధిలోని వర్తూరు మరువ ఫ్లైఓవర్‌ నిర్మాణాలకు రూ.150.05 కోట్లు కేటాయించేందుకు అంగీకరించామన్నారు. వీటితో పాటు జిల్లాల వారిగా ప్రాధాన్యతా అంశాలకు గ్రాంట్‌లు కేటాయించామన్నారు.

Read more