బెంగళూరు: ఆయనో ఓ మంత్రి. ప్రజలకు రక్షకుడుగా ఉండాల్సిన వారు. ఇవేమీ ఆయనకు గుర్తున్నట్లు లేవు. తనకు ఉపాధి కల్పించాలంటూ కోరిన యువతిని ఆదుకోవాల్సింది పోయి ఆమె జీవితంతో ఆటలాడుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.
కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి దగ్గరకు కొన్ని రోజుల క్రితం ఓ యువతి వచ్చింది. షార్ట్ ఫిలిమ్ విషయమై సహకారం అడిగేందుకు మంత్రి వద్దకు వచ్చింది. అయితే సదరు అమాత్యులు ఆ యువతిని ప్రలోభపెట్టారు. కేపీటీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నారు. యువతిని లైంగికంగా వేధించారు.
అయితే మంత్రిగారి వ్యవహారం మీడియాలో లీక్ అవడంతో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బాధిత యువతితో మంత్రి మాట్లాడిన సంభాషణలు, వీడియో టేపులు దుమారం రేపుతున్నాయి.