కర్ణాటకలో త్వరలో పూర్తిగా లాక్‌డౌన్...

ABN , First Publish Date - 2021-05-07T18:06:09+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా పూర్తి లాక్‌డౌన్ విధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప శుక్రవారం సూచన ప్రాయంగా వెల్లడించారు...

కర్ణాటకలో త్వరలో పూర్తిగా లాక్‌డౌన్...

సీఎం యెడియూరప్ప సూచన 

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా పూర్తి లాక్‌డౌన్ విధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప శుక్రవారం సూచన ప్రాయంగా వెల్లడించారు. ‘‘ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు, దీనివల్ల కర్ణాటకలో పూర్తి లాక్ డౌన్ విధించడం అనివార్యం కావచ్చు’’ అని సీఎం యెడియూరప్ప చెప్పారు. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కరోనా కేసుల కట్టడి కోసం కర్ణాటకలో కఠినమైన నియమాలు, లాక్ డౌన్ వర్తింపచేయాలని నిపుణులు సూచించారు. కరోనా రోగులకు సహాయం కోసం తన ఆఫీసుకు, ఇంటికి రావద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. గురువారం రెండు సంఘటనల్లో రోగులు పడకల కోసం విధానసౌధకు, సీఎం నివాసానికి వచ్చి సహాయం కోరారు.తమ అధికారులు స్పందించి కరోనా రోగులకు సహాయం చేస్తారని సీఎం వివరించారు.

Updated Date - 2021-05-07T18:06:09+05:30 IST