లాక్‌డౌన్ పొడిగిస్తే రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయం

ABN , First Publish Date - 2020-04-07T18:05:19+05:30 IST

లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత పొడిగిస్తే రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని....

లాక్‌డౌన్ పొడిగిస్తే రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయం

బెంగళూరు (కర్ణాటక): కరోనా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత పొడిగిస్తే రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. మద్యానికి అలవాటైన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు మందుబాబులు మద్యం లభించడం లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో  ఏప్రిల్ 14వతేదీ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రతీ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదించారు. మద్యం కోసం వైన్ దుకాణాల్లో చోరీలు కూడా సాగుతున్న నేపథ్యంలో సర్కారు మద్యం విక్రయించాలని ప్రతిపాదించింది. మద్యానికి డిమాండ్ పెరిగిన దృష్ట్యా మూడు గంటలపాటు మద్యం విక్రయించాలని యోచిస్తున్నామని, దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని కర్ణాటక ఎక్సైజ్ శాఖ కమిషనర్ యశ్వంత్ చెప్పారు. 

Updated Date - 2020-04-07T18:05:19+05:30 IST