చిత్తూరు: జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం పట్టుబడింది. పెనుమూరు మండలంలో 60 కర్నాటక మద్యం బాటిల్స్‌ను తరలిస్తుండగా నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. తమకు అందిన పక్క సమాచారంతో పోలీసుల దాడి చేసి మద్యాన్ని పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు ఆరెస్టు చేశారు. కాగా వీరు, పూతలపట్టు, కల్లూరు మండలాల్లో పలు ఆలయాల్లో హుండీ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.