పులుల రాజధానిగా కర్ణాటక!

ABN , First Publish Date - 2022-01-17T09:09:23+05:30 IST

బెంగళూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో పులుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. దీంతో రాష్ట్రం మరోసారి పులుల రాజధానిగా వెలు గొందనుంది.

పులుల రాజధానిగా కర్ణాటక!

బెంగళూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో పులుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. దీంతో రాష్ట్రం మరోసారి పులుల రాజధానిగా వెలు గొందనుంది. 2018తో పోలిస్తే ఈ మూడేళ్లలో పులుల సంఖ్య 10% పెరి గినట్టు రాష్ట్ర చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ విజయ్‌కుమార్‌ తెలిపా రు. ఈ క్రమంలో దేశంలో అత్యధిక పులులున్న రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్‌ను వెనక్కునెట్టి కర్ణాటక మూడోసారి అగ్రస్థానంలో నిలవ నుందని ఆయన అన్నారు. కర్ణాటకలో 36 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం లో 5 పులుల సంరక్షణా కేంద్రాలున్నాయని చెప్పారు. 2018లో రాష్ట్రంలో అధికారికంగా 524 పులులు ఉన్నట్లు గుర్తించామని, వీటి సంతతి 10% పెరిగిందని వెల్లడించారు. 2010, 2014లోనూ అత్యధిక పులులున్న రాష్ట్రాల్లో కర్ణాటక టాపర్‌గా నిలిచింది. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర అడవుల్లో పులులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తిం చారు. రాష్ట్రంలోని బండీపుర పులుల సంరక్షణా కేంద్రంలో 2018లో 173 పులులు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వీటి సంఖ్య 200 దాటింది.

Updated Date - 2022-01-17T09:09:23+05:30 IST