ఇక ఊరుకోమంటూ కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-16T23:31:15+05:30 IST

కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన ..

ఇక ఊరుకోమంటూ కర్ణాటక హోం మంత్రి హెచ్చరిక

బెంగళూరు: కర్ణాటకలోని స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ కొన్ని చోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతుండటంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర కన్నెర్ర చేశారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు హైకోర్టు తాత్కాలిక ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు నిరసనలు సాగిస్తుండటంపై జ్ఞానేంద్ర మాట్లాడుతూ, ఇంతకాలం తాము ఓపికతో వ్యవహరించామని, ఇంకెంతమాత్రం ఊరుకునేది లేదని అన్నారు. విద్యార్థుల సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని వారి మనోభావాలు దెబ్బతినకూడదని తాము ఇంతవరకూ ఓర్పుతో ఉన్నామని అన్నారు. బయట వ్యక్తులు రెచ్చగొడుతుండటంతో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారని అన్నారు. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ కోర్టు ఉత్తర్వులకు కట్టుబడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. వీటిని ఉల్లంఘిస్తే మరో ఆలోచనా లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిజాబ్ తమ హక్కంటూ ముస్లిం విద్యార్థినులు రోడ్లపైకి వస్తుండటంపై మాట్లాడుతూ, ఇంతవరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోలేదని మంత్రి చెప్పారు. మొత్తం మీద శాంతియుత వాతావరణమే ఉందని తెలిపారు.

Updated Date - 2022-02-16T23:31:15+05:30 IST