కర్ణాటక హోంమంత్రి నివాసం ముట్టడి

ABN , First Publish Date - 2022-07-31T10:18:30+05:30 IST

బెంగళూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లాలో ప్రవీణ్‌ హత్యకు పాలపుర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ) వారే కారణమని, ఆ సంస్థను వెంటనే నిషేధించాలని

కర్ణాటక హోంమంత్రి నివాసం ముట్టడి

పీఎ్‌ఫఐని నిషేఽధించాలని ఏబీవీపీ డిమాండ్‌

బెంగళూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లాలో ప్రవీణ్‌ హత్యకు పాలపుర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ) వారే కారణమని, ఆ సంస్థను వెంటనే నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ బెంగళూరులో కర్ణాట క హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర నివాసాన్ని ఏబీవీపీ కార్యకర్తలు శనివారం ముట్టడించా రు. 40 మందికి పైగా ఏబీవీపీ కార్యకర్తలు, జయమహల్‌ రోడ్డులోని హోంశాఖ మంత్రి ఇంటి గేటు ఎదుట ఆందోళన చేశారు. వారిని పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారు. అంతలోనే మరో వైపు నుంచి కార్యకర్తలు లోపలకు ప్రవేశించారు. వారు మంత్రి నివాసంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రి నివాసాన్ని సొంత పార్టీ అనుబంధ విభాగంవారు ముట్డడించడం చర్చనీయాంశమైంది. కాగా, బెంగళూ రు దక్షిణ లోక్‌సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య నివాసాన్ని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ముట్టడించారు. ప్రవీణ్‌ నెట్టారు హత్య జరిగిన తర్వాత, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే రాళ్లతో కొట్టేవారమని ఎంపీ తేజస్వి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పదవిలో ఉంటూ రాళ్లతో కొడతామనడం ఎంతవరకూ సమంజసమని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-31T10:18:30+05:30 IST