హిజాబ్ ధరించిన ముస్లిం అమ్మాయిలను హిందూత్వ మూకలు వేధిస్తున్నాయి...

ABN , First Publish Date - 2022-02-11T14:32:54+05:30 IST

ఫ్రెంచ్ ఫుట్‌బాల్ స్టార్ పాల్ పోగ్బా కర్ణాటక హిజాబ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

హిజాబ్ ధరించిన ముస్లిం అమ్మాయిలను హిందూత్వ మూకలు వేధిస్తున్నాయి...

ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పాల్ పోగ్బా సంచలన వ్యాఖ్యలు

పారిస్: ఫ్రెంచ్ ఫుట్‌బాల్ స్టార్ పాల్ పోగ్బా కర్ణాటక హిజాబ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జాయ్ తర్వాత కర్ణాటక హిజాబ్‌పై మాట్లాడిన రెండవ అంతర్జాతీయ వ్యక్తి పోగ్బా. కాషాయ కండువాలు ధరించిన అబ్బాయిల మధ్య హిజాబ్ ధరించిన ముస్లిం అమ్మాయిలున్న వీడియో క్లిప్‌ను మాంచెస్టర్ యునైటెడ్ మిడ్‌ఫీల్డర్ పాల్ షేర్ చేస్తూ కర్ణాటక హిజాబ్ వివాదంపై వ్యాఖ్యలు చేశారు.‘‘హిజాబ్ ధరించి భారతదేశంలోని కాలేజీకి వచ్చే ముస్లిం అమ్మాయిలను హిందూత్వ మూకలు వేధిస్తూనే ఉన్నాయి.’’ అని పాల్ పోగ్బా తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టారు.దీంతో కర్ణాటక హిజాబ్ వివాదం అంతర్జాతీయ దృష్టి పడింది.


నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఇంతకుముందు కర్ణాటకలో హిజాబ్ వివాదంపై స్పందిస్తూ, ‘‘ముస్లిం అమ్మాయిలను హిజాబ్‌లతో పాఠశాలకు వెళ్లనివ్వక పోవడం భయంకరమైనది’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌, జస్టిస్‌ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం గురువారం హిజాబ్‌ ధరించడంపై విధించిన ఆంక్షలపై ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది. ఫిబ్రవరి 14వతేదీ సోమవారం ఈ అంశాన్ని మరోసారి విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ విషయం కోర్టులో పెండింగులో ఉన్నంత వరకు విద్యార్థినులు ఎటువంటి మతపరమైన దుస్తులు ధరించవద్దని కోరింది.


Updated Date - 2022-02-11T14:32:54+05:30 IST