High Court: బుల్లెట్లు ఉంటే నేరం కాదు..!

ABN , First Publish Date - 2022-08-18T17:19:50+05:30 IST

పిస్టల్‌, రివాల్వర్‌ లేకుండా ఎవరి వద్దనైనా బుల్లెట్లు లభిస్తే అది నేరం కాదని హైకోర్టు(High Court) బుధవారం సంచలన తీర్పునిచ్చింది.

High Court: బుల్లెట్లు ఉంటే నేరం కాదు..!

                                      - హైకోర్టు సంచలన తీర్పు 


బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పిస్టల్‌, రివాల్వర్‌ లేకుండా ఎవరి వద్దనైనా బుల్లెట్లు లభిస్తే అది నేరం కాదని హైకోర్టు(High Court) బుధవారం సంచలన తీర్పునిచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న వేళ తనిఖీల సమయంలో బ్యాగులో రెండు బుల్లెట్లు లభించడంతో తనపై మంగళూరులో దాఖలైన కేసును సవాల్‌ చేస్తూ జోసెఫ్‌ ఫెర్నాండెజ్‌ అనే వ్యక్తి దాఖలు చేసుకున్న పిటీషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌చందనగౌడ(Hemantchandana Gowda) ఈ పిటీషన్‌పై వాద వివాదాలు ఆలకించిన అనంతరం జోసెఫ్‌ ఫెర్నాండెజ్‌పై దాఖలైన కేసును కొట్టివేశారు. వాదవివాదాల స మయంలో ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. తుపాకీ(gun) లేకుండా ఖాళీ బుల్లెట్లతో ఏం చేయగలరనే సున్నితమైన అంశాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. 

Updated Date - 2022-08-18T17:19:50+05:30 IST