రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు loudspeakersపై నిషేధం

ABN , First Publish Date - 2022-05-11T17:40:27+05:30 IST

లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది....

రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు loudspeakersపై నిషేధం

కర్ణాటక ప్రభుత్వ తాజా ఆదేశాలు

బెంగళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది.అనుమతి పొందిన వారు తప్ప లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.మహారాష్ట్రలోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ మహా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.లౌడ్ స్పీకర్లపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది.మే 3వతేదీలోగా మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఏప్రిల్ 12న మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎన్ఎస్ చీఫ్ అల్టిమేటం ఇవ్వడంతో లౌడ్ స్పీకర్ల గొడవ మొదలైంది.


 లేని పక్షంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపిస్తారని హెచ్చరించారు.ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించే ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసాను ప్లే చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో రాజ్ థాకరేపై మంగళవారం కేసు పెట్టారు.


Read more