Karnataka: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు, వీడియోల చిత్రీకరణ నిషేధంపై వెనక్కితగ్గిన CM

ABN , First Publish Date - 2022-07-16T21:48:14+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఫోటోగ్రాఫ్‌లు, వీడియో షూటింగ్‌లు జరపకుండా విధించిన నిషేధ ఉత్తర్వులపై బసవరాజ్ బొమ్మై...

Karnataka: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు, వీడియోల చిత్రీకరణ నిషేధంపై వెనక్కితగ్గిన CM

బెంగళూరు: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఫోటోగ్రాఫ్‌లు, వీడియో షూటింగ్‌లు జరపకుండా విధించిన నిషేధ ఉత్తర్వులపై బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నిషేధ ఉత్తర్వులను పెర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ శాఖ (DPAR) శనివారంనాడు ఉపసంహరించుకుంది. కాగా, నిషేధ ఉత్తర్వుల విషయం తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు.


''మా ప్రభుత్వంలో ఎలాంటి దాపరికాలు లేవు. పూర్తి జవాబుదారీతనంలో పనిచేస్తుంది. ఆ కారణంగానే ఎలాంటి ఆంక్షలు లేని యథాపూర్వ పరిస్థితి కొనసాగాలని నిర్ణయించాం'' అని సీఎం చెప్పారు. ఎంప్లాయిస్ అసోసియేషన్ ఇచ్చిన పిటిషన్‌లో కొన్ని మెరిట్స్ కూడా లేకపోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు, వీడియోలు తీసుకోవడం గురించి ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా మాట్లాడుతున్నారని, మహిళల ఫోటోలు తీసేటప్పుడు సహజంగానే సమస్యలు ఉంటాయని ఆయన చెప్పారు.


కాగా, కొందరు వ్యక్తులు ఈ వీడియోలు తీస్తూ ఉద్యోగులను బెదిరిస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఆరోపిస్తోంది. అసోసియేషన్ పిటిషన్ పరిగణనలోకి తీసుకుని వీడియోలు, ఫోటోల చిత్రీకరణపై నిషేధ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఈ ఆంక్షలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకుంది. కర్ణాటక ప్రభుత్వం ఈ తరహా ఆంక్షలు విధించడం ఇది మొదటిసారి కాదు. 2021లో విధాన్ సౌధ కారిడార్లను మీడియావర్గాలు ఫోటోలు, వీడియోలు తీయకుండా నిషేధం విధించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. 2019లో ప్రభుత్వం ఎంపిక చేసిన 150 జర్నలిస్టులను మాత్రమే విధాన సౌధ, వికాస్ సౌధ, కర్ణాటక సెక్రటేరియట్‌లోకి అనుమతిస్తామంటూ మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వాటిని నిలిపివేశారు. 2018లో విజిటర్లు, మీడియా వ్యక్తులపై ఆంక్షలు విధించాలని పోలీసులు సూచించగా, అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి మొగ్గుచూపారు. అయితే సీఎం, మంత్రులుకూర్చునే విధానసభ మూడో అంతస్తులో జర్నలిస్టుల ప్రవేశంపై విధించిన ఆంక్షల సర్క్యులర్‌ను ప్రభుత్వం ఆ ఏడాది అక్టోబర్‌లో ఉపసంహరించుకుంది.

Updated Date - 2022-07-16T21:48:14+05:30 IST