అయోధ్యలో ‘యాత్రి నివాస్‌’కు రూ.10 కోట్లు.. కర్నాటక సీఎం

ABN , First Publish Date - 2021-03-08T19:32:11+05:30 IST

అసెంబ్లీలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బడ్జెట్ ప్రవేశపెడుతూ..

అయోధ్యలో ‘యాత్రి నివాస్‌’కు రూ.10 కోట్లు.. కర్నాటక సీఎం

బెంగళూరు: అయోధ్యలో తమ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిర్మాణాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది కర్నాటక సర్కార్. అసెంబ్లీలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప బడ్జెట్ ప్రవేశపెడుతూ..  రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల కోసం యాత్రి నివాస్ పేరుతో వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీని నిర్మాణం కోసం బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. యూపీ సర్కార్ ఐదెకరాల స్థలాన్ని కేటాయించనుందని చెప్పారు. ఇదిలా ఉంటే, ప్రతి జిల్లాలో గోశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గోవధను నిరోధించడానికి ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 15, 134 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు కర్నాటక సీఎం వెల్లడించారు.

Updated Date - 2021-03-08T19:32:11+05:30 IST