కరోనా నియంత్రణకు కర్ణాటకకు రూ.395 కోట్ల గ్రాంటు

ABN , First Publish Date - 2020-04-05T14:59:05+05:30 IST

కరోనా నియంత్రణకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులలో

కరోనా నియంత్రణకు కర్ణాటకకు రూ.395 కోట్ల గ్రాంటు

బెంగళూరు : కరోనా నియంత్రణకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులలో భాగంగా రాష్ట్రానికి రూ. 395 కోట్లు మంజూరైంది. కరోనా నియంత్రణకు అత్యవసరమైన పనులకు ఈ నిధులను వినియోగించుకునే వీలుంటుంది. కరోనా అనుమానితులకు ప్రత్యేకమైన క్వారంటైన్‌ సౌలభ్యం, నమూనాల సేకరణ, శిబిరాలు, అదనపు ల్యాబరేటరీలు, ఆరోగ్యరక్షణ, స్థానిక సంస్థలు, పోలీసు, అగ్నిమాపకశాఖ సిబ్బందికి అవసరమైన రక్షణా వస్తువులు, థర్మల్‌ స్కానర్‌, వెంటిలేటర్‌లు, ఎయిర్‌ ప్యూరిఫైర్‌లతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.


రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడం, ఢిల్లీ ధార్మిక సదస్సు తర్వాత జిల్లాల వారీగా రోగుల సంఖ్య అధికం కావడం వంటి పరిణామాల తరుణంలో కేంద్రప్రభుత్వం నుంచి రూ.395.50 కోట్లు విడుదల కావడం సంతోషకరమని ముఖ్యమంత్రి యడియూరప్ప అభిప్రాయపడ్డారు. గురువారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫెరెన్స్‌లో పరిస్థితిని ఆరా తీశారని వివరించిన మేరకు శుక్రవారం నిధులు విడుదల అయ్యాయన్నారు. 

Updated Date - 2020-04-05T14:59:05+05:30 IST