ఇంకొక్క స్థానం గెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-31T17:43:41+05:30 IST

కర్ణాటక ఎగువసభలో అధికార బీజేపీ మెజారిటీకి ఒకే ఒకస్థానం దూరంలో ఉంది. ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు జూన్‌ 13న జరగనున్న ఎన్నికల్లో ఏ ఒక్క స్థానాన్ని

ఇంకొక్క స్థానం గెలిస్తే..

                           - ఎగువసభలో Bjpకి మెజారిటీ 


బెంగళూరు: కర్ణాటక ఎగువసభలో అధికార బీజేపీ మెజారిటీకి ఒకే ఒకస్థానం దూరంలో ఉంది. ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు జూన్‌ 13న జరగనున్న ఎన్నికల్లో ఏ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నా సరే 75 మంది సభ్యుల బలం కలిగిన విధానపరిషత్‌లో బీజేపీ సింపుల్‌ మెజారిటీ సాధించనుంది. శాసనసభ నుంచి విధానపరిషత్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలను గెలుపొందింది. దీంతో సభలో బీజేపీ బలం 36కు పెరిగింది. పరిషత్‌లో ప్రస్తుతం కాంగ్రె్‌సకు 28మంది సభ్యులు, జేడీఎ్‌సకు 10మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్రులు ఒకరు, యాక్టింగ్‌ సభాపతిగా ఒకరు ఉన్నారు. జూన్‌ 13న జరిగే నాలుగు స్థానాల్లో ఒక స్థానం గెలుపొందినా సరే బీజేపీ బలం 37కు పెరగనుంది. పైగా సభాపతి, ఉపసభాపతి స్థానాలను సులభంగా కైవసం చేసుకోవడంతోపాటు కీలకమైన మతమార్పిడి నియంత్రణ బిల్లును ఆమోదించుకోవడం సులభతరం కానుంది. 4 స్థానాలలో కనీసం మూడింటిని కైవసం చేసుకుంటామని బీజేపీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. 

Updated Date - 2022-05-31T17:43:41+05:30 IST