రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా వందితా శర్మ

ABN , First Publish Date - 2022-06-01T17:01:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వందితాశర్మ సచివాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర 39వ ముఖ్యకార్యదర్శిగా ఆమె

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా వందితా శర్మ

బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వందితాశర్మ సచివాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర 39వ ముఖ్యకార్యదర్శిగా ఆమె నియమితులైన సంగతి విదితమే. గతంలో 2000లో థెరెస్సా భట్టాచార్య, 2006లో మాలతీదాస్‌, 2017లో కే రత్నప్రభ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులుగా వ్యవహరించిన మహిళా ఐఏఎస్ లు కావడం తెలిసిందే. ఈ కోవలో వందితాశర్మ ఈ కీలక పదవిని అలంకరించిన మహిళా ఐఏఎస్ గా అరుదైన గుర్తింపును తన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సచివాలయంలో శాసనసభ కార్యదర్శిగా ఎంకే విశాలాక్షి, విధానపరిషత్‌ కార్యదర్శిగా కేఆర్‌ మహాలక్ష్మి కీలక పదవులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. 1986వ బ్యాచ్‌కు చెందిన వందితాశర్మ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధశాఖల కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పదాధికారులు, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా తాను శక్తివంచన లేకుండా పాటుపడతానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలిస్తానని భరోసా ఇచ్చారు. 

Updated Date - 2022-06-01T17:01:59+05:30 IST