కర్ణాటకలో త్వరలో మంత్రివర్గ విస్తరణ?

ABN , First Publish Date - 2020-09-29T14:53:16+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప యోచిస్తున్నారా? అంటే అవునంటున్నాయి....

కర్ణాటకలో త్వరలో మంత్రివర్గ విస్తరణ?

అధిష్ఠానంతో కసరత్తుకు యెడియూరప్ప ఢిల్లీ యాత్ర

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప యోచిస్తున్నారా? అంటే అవునంటున్నాయి కర్ణాటక రాష్ట్ర అధికార బీజేపీ వర్గాలు. కర్ణాటక రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి సీటీ రవిని మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు కొందరు సభ్యులను కొత్త మంత్రులుగా తీసుకుంటారని భావిస్తున్నారు. అర్వింద్ లింబవలి, ఉమేష్ కట్టి, బసన్ గౌడపాటిల్ యత్నాల్, సునీల్ కుమార్, హాలాడీ శ్రీనివాసశెట్టిలను సీఎం తన కేబినెట్లోకి తీసుకుంటారని ఊహాగానాలు వెలువడ్డాయి.


సెప్టెంబరు 27వతేదీన కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా  యెడియూరప్ప అధిక సభ్యుల ఓట్లతో సభ విశ్వాసం పొందారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు సీఎం యెడియూరప్ప త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2020-09-29T14:53:16+05:30 IST