Karnatakaలో ముస్లిం బాలికల వివరాలతో బీజేపీ ట్వీట్...వెల్లువెత్తిన విమర్శలతో తొలగింపు

ABN , First Publish Date - 2022-02-16T15:37:58+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ముస్లిం బాలికల వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి....

Karnatakaలో ముస్లిం బాలికల వివరాలతో బీజేపీ ట్వీట్...వెల్లువెత్తిన విమర్శలతో తొలగింపు

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ముస్లిం బాలికల వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తరగతి గదుల్లో హిజాబ్‌లు ధరించడం నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన ఉడిపికి చెందిన బాలికల నివాస చిరునామాలతో సహా వారి వ్యక్తిగత వివరాలను భారతీయ జనతా పార్టీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసింది.ముస్లిం బాలికల వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పెట్టడంపై విమర్శలు రావడంతో బీజేపీ పార్టీ ఇంగ్లీషు, కన్నడ భాషల్లోనూ చేసిన ట్వీట్లను తొలగించింది.కర్ణాటకలో హిజాబ్ వివాదంపై బాలికలు వేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ఫుల్ బెంచ్ రోజువారీగా విచారణ జరుపుతోంది.మైనర్ బాలికల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు బీజేపీపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు.


‘‘ సిగ్గులేని కర్ణాటక బీజేపీ ప్రతిపక్షాలపై దాడి చేయడానికి మైనర్ బాలికల చిరునామాలను ట్వీట్ చేస్తుంది. ఇది ఎంత సున్నితత్వం,దయనీయమైనదో మీరు గ్రహించగలరా? ఈ ట్వీట్లను తొలగించాలని నేను అభ్యర్థిస్తున్నాను. ’’అంటూ ఎంపీ ప్రియాంక కర్ణాటక డీజీపీ, ట్విట్టరు ఇండియాలను జత చేసింది.జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని రాజ్యసభ సభ్యురాలైన ప్రియాంక డిమాండ్ చేశారు. ‘మైనర్‌బాలికల పేర్లు, చిరునామాలను పంచుకోవడం నేరపూరిత చర్య. ఇది ఆమోదయోగ్యం కాదు’’ అని చతుర్వేది ట్వీట్ చేశారు.


Updated Date - 2022-02-16T15:37:58+05:30 IST