గాయపడ్డ ఏనుగుకు చికిత్స

ABN , First Publish Date - 2020-04-01T16:23:09+05:30 IST

గాయపడ్డ ఏనుగుకు చికిత్స

గాయపడ్డ ఏనుగుకు చికిత్స

కర్ణాటక, డెంకణీకోట: కృష్ణగిరి జిల్లా డెంకణీకోట సమీపంలోని అటవీ ప్రాంతంతో గాయపడ్డ ఏనుగుకు వైద్యులు చికిత్స అందించారు. నుగనూర్‌ అటవీ ప్రాంతంలో ఎనుగు పడి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు.  అధికారులు వెంటనే ఆ స్థలానికి చేరుకుని ఆ ఏనుగును పరిశీలించారు. కాలుకు దెబ్బతగిలి బాధపడుతున్నట్లు గుర్తించి వైద్య సేవలందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 30 మంది వైద్యులు దానికి చికిత్స అందించారు. 


Updated Date - 2020-04-01T16:23:09+05:30 IST