Abn logo
Mar 6 2021 @ 23:44PM

బతుకమ్మ చీరలకు ప్రభుత్వం కూలి పెంచాలి

సిరిసిల్ల రూరల్‌, మార్చి 6: సిరిసిల్లలో ఈసంవత్సరం తయారు చేసే బతుకమ్మ చీరలకు కూలి రాష్ట్ర ప్రఽభుత్వం పెంచాల డిమాండ్‌ చేస్తూ సోమవారం  సిరిసిల్లలో అసాములు, కార్మికులు ఒక్క రోజు మెరుపు సమ్మె చేపట్టనున్నారని పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌, అసాముల సమన్వయ కమిటీ, సీఐటీయూ నాయకులు సంయుక్తంగా ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్‌, అసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు పోరండ్ల రమేశ్‌, సీఐటీయూ జిల్లాకార్యదర్శి కోడం రమణ మాట్లాడారు. 2021 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి పలురకాల డిజైన్‌లలో ఉత్పత్తి చేయాలని ఆర్డర్లు ఇచ్చారని చెప్పారు. దీని వల్ల మరమగ్గాల కార్మికులతోపాటు అసాములకు విపరీతంగా పని భారం పెరిగి ఉత్పత్తి తగ్గి గతంలో కంటే తక్కువ వేతనాలు వచ్చే పరిస్థితి ఉంద న్నారు. డిజైన్‌ల కోసం మరమగ్గాలపై డాబీలు, పింజర్లు జకార్డులను ఏర్పాటు చేసుకోవడం కోసం అసాములకు అర్థికంగా అదనపు భారం పడనుందని చెప్పారు. ఈ భారాన్ని యాజమానులు భరించాలని యాజమానులతోపాటు కలెక్టర్‌, చేనేత జౌళీశాఖ అధికారులకు వినతి పత్రాలు అందించిన ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు. పాలిస్టర్‌ వస్త్రాలకు సంబంధించిన కూలి ఒప్పందం గడువు ముగిసి రెండేళ్లు గడుస్తున్నా యాజమానులు కూలి పెంచడం కోసం ముం దుకు రావడం లేదన్నారు. వీటిపై యాజమానులు, అధికారుల తోపాటు రాష్ట్రప్రభుత్వం స్పందించాలంటూ సోమవారం మెరుపు సమ్మెను చేయడంతోపాటు చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట ఽధర్నా చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసాములు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావే శంలో చేరాల అశోక్‌, మండల రాజు, కొండ సుభాష్‌, జక్కని సుదర్శన్‌, రాపెల్లి శ్రీహరి, గడ్డంఎల్లయ్య, రవీందర్‌, రాజేశం పాల్గొన్నారు. 

Advertisement
Advertisement