Abn logo
Aug 3 2020 @ 11:30AM

కరోనా కాటుకు సౌదీలో తెలంగాణ వాసి మృతి!

జెడ్డా: సౌదీ అరేబియాలో కరోనా కాటుకు తెలంగాణ వాసి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌కు చెందిన 48ఏళ్ల మహమ్మద్ ఇంతియాజ్ హుస్సేన్ కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. జెడ్డాలోని ఓ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీలో ఇంతియాజ్ హుస్సేన్ పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొద్ది వారాల క్రితం కరోనా బారినపడ్డారు. దీంతో అతని స్నేహితులు.. ఇంతియాజ్‌ హుస్సేన్‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యం పొందతూ కరోనాతో పోరాడుతున్న ఇంతియాజ్ హుస్సేన్ ఆరోగ్యం.. గత కొద్ది రోజులుగా మరింత క్షిణించింది. దీంతో శుక్రవారం రోజు.. ఇంతియాజ్ హుస్సేన్ కన్నుమూశారు. కాగా.. నిబంధనల ప్రకారం.. ఇంతియాజ్ హుస్సేన్ మృతదేహానికి శనివారం రోజు అంత్యక్రియలు పూర్తయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. సౌదీ అరేబియాలో కరోనా కాటుకు ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3వేలకు చేరువలో ఉంది. 


Advertisement
Advertisement
Advertisement