Karimnagar: హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-05T01:51:50+05:30 IST

హుజురాబాద్ (Huzurabad) అంబేద్కర్ చౌక్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ (Trs), బీజేపీ (Bjp) కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది...

Karimnagar: హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ దగ్గర ఉద్రిక్తత

కరీంనగర్ (Karimnagar): హుజూరాబాద్ (Huzurabad) అంబేద్కర్ చౌక్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ (Trs), బీజేపీ (Bjp) కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. పార్టీ జెండాలు కడుతుండగా ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. పరస్పర తోపులాట జరిగింది, పోటాపోటీగా వ్యతిరేక నినాదాలు చేశారు. హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు టీఆర్ఎస్ నేత కౌశిక్రెడ్డి (Kousik Reddy) సవాల్ విసిరారు. దీంతో పోటా పోటీగా బీజేపీ, టీఆరెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో సీఐ శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. 

Updated Date - 2022-08-05T01:51:50+05:30 IST