Abn logo
Oct 8 2021 @ 12:26PM

హుజురాబాద్‌లో భారీగా మోహరించిన పోలీసులు

కరీంనగర్: హుజూరాబాద్‌లో భారీగా పోలీసులు మోహరించారు. చివరి రోజు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను నామినేషన్ వేయకుండా  పోలీసులు అడ్డుకుంటున్నారు. బారికేడ్లు దాటకుండా భారీగా  పోలీసులు మోహరించారు. అభ్యర్థిని బల పరిచే స్థానికులకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై ఫీల్డ్ అసిస్టెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని...కానీ తమ ప్రచారాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సిద్దిపేట మంత్రి హరీష్ రావు నామినేషన్ వేయనివ్వడం లేదని ఆరోపించారు. తొలి రోజే తమను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. రేపటి నుంచి ఇక టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని...ఊరూరా తిరుగుతామని ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption