Abn logo
Sep 22 2021 @ 13:13PM

బాల్క సుమన్‌పై బొడిగే శోభ ఫైర్

కరీంనగర్ జిల్లా: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఫైర్ అయ్యారు. బుధవారం ఆమె హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘‘నీ నియోజకవర్గంలో దళితులకు దళిత బంధు ఇప్పించు.. దళిత బిడ్డవైతే దళిత సీఎం, మూడు ఎకరాల భూమి వంటి వాటిపై సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించు.. దమ్ముంటే ఓయూ గడ్డపైకి రా.. ఎంగిలి మెతుకులు తినే నువ్వా బండి సంజయ్‌ను విమర్శించేది.. సంజయ్ పిలుపిస్తే నీ నియోజకవర్గం దాటవ్, దళిత ద్రోహివి.. నువ్వు కేసీఆర్ కుటుంబం ఏజెంటివి’’ అంటూ బొడిగే శోభ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండిImage Caption