కరీంనగర్ జిల్లా: హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వేళ గోడ గడియారాల పంపిణీ కలకలం రేపుతోంది. వాచ్‌లను పంచుతున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. అవి బీజేపీకి చెందినవిగా అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. గోడ గడియారాలు స్వాధీనం చేసుకున్న స్థానికులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి.