Abn logo
Jul 26 2021 @ 10:46AM

కార్గిల్ అమర వీరులకు ప్రధాని నివాళులు!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో... ‘కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా మనం అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. వారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి ధైర్య సాహసాలు మనకు ప్రేరణగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు. ఇదేవిధంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఈరోజు మనం కార్గిల్ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.