వీరజవాన్ల రుణం తీర్చుకోలేనిది

ABN , First Publish Date - 2021-07-27T05:39:01+05:30 IST

దేశరక్షణలో అసువులు బాసిన వీరజవాన్లు రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని జాతీయ క్రీడాకారుడు ఎన్‌వీఆర్‌ దాస్‌ అన్నారు.

వీరజవాన్ల రుణం తీర్చుకోలేనిది
భీమవరంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ ర్యాలీ

జాతీయ క్రీడాకారుడు ఎన్‌వీఆర్‌ దాస్‌ 

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ ర్యాలీ

భీమవరం/భీమవరం ఎడ్యుకేషన్‌/పాలకొల్లు అర్బన్‌, జూలై 26 : దేశరక్షణలో అసువులు బాసిన వీరజవాన్లు రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని జాతీయ క్రీడాకారుడు ఎన్‌వీఆర్‌ దాస్‌ అన్నారు. స్వచ్ఛంద సంస్థల నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లు శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో సోమవారం క్విట్‌ ఇండియా స్తూపం వద్ద కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సదస్సు, ర్యాలీ, మిలటరీ ఉద్యోగులకు సత్కరించారు. తహసీల్దార్‌ రమణారావు, వన్‌టౌన్‌ సిఐ కృష్ణభగవాన్‌, ఎన్‌వీఆర్‌ దాస్‌ మాట్లాడుతూ 1999 మే 3న పాకిస్తాన్‌ సైన్యం దురాక్రమణకు పాల్పడగా భారత సైనికులు 2లక్షల మందితో జూలై 26 వరకు 70 రోజులకు పైగా జరిగిన వీరోచిత పోరాటంలో భారత సైనికులు 523 మంది వీరమరణం పొందార న్నారు. అనంతరం పది మంది మిలటరీలో పనిచేసిన వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అడగర్ల ప్రభాకర గాంధీ, షేక్‌ కాశిమ్‌, షేక్‌ బాబాజీ సాహెబ్‌, చింతాడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. భారతీయ విద్యాభనవ్స్‌లో ప్రిన్సిపాల్‌ ఎల్‌వీ రమాదేవి ఆధ్వర్యంలో కార్గిల్‌ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లులోని కొత్తపేట మునిసిపల్‌ ఎలి మెంట్రీ పాఠశాలలో కార్గిల్‌ దివస్‌ కార్యక్రమాన్ని పీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పీఎన్‌డీవీ ప్రసాద్‌ విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఆర్‌. భవానీప్రసాద్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:39:01+05:30 IST