Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 17:26:28 IST

Kareena kapoor: టార్గెట్‌ చేసి కిల్‌ చేస్తున్నారు!

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌  మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ (Amir khan)నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal singh chedda)భారీ అంచనాల మధ్య ఈ నెల 11న విడుదలైనప్పటికీ ఆ అంచనాలను అందుకోలేదు. అభిమానులను నిరాశ పరచింది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. గతంలో దేశంపై ఆమిర్‌ చేసిన వ్యాఖ్యలు ఓ కారణమైతే, కథలో బలం లేకపోవడం మరో కారణం. పైగా ‘బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌చడ్డా’ క్యాంపెయిన్‌ కూడా ఈ చిత్రం జనాల్లోకి వెళ్లకపోవడానికి కారణం. తాజాగా  ఈ విషయంపై కరీనా కపూర్‌ స్పందించారు. సినిమా విడుదలకు ముందు ‘బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌చడ్డా’ (Boycott laal singh chedda) పై స్పందించిన కరీనా (Kareena kapoor khan)‘ఓ విషయంపై అందరికీ ఒకే అభిప్రాయం ఉండదు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. మంచి సినిమా తీసినప్పుడు ఇవన్నీ అడ్డురావు. సమస్యలను అధిగమించి విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. 


‘‘కొందరు టార్గెట్‌ చేసి మా సినిమాను కిల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వందమందిలో ఒకరు అలా ఉంటారు. వారే మా సినిమాపై ట్రోలింగ్‌ చేస్తున్నారు. మిగిలిన 99మంది సినిమాను ఆదరిస్తున్నారు. ఒక మంచి సినిమాను బాయ్‌కాట్‌ చేయాలనుకుంటే దానిని ప్రేక్షకులకు దూరం చేసినట్లే. మూడేళ్లపాటు 200 మందికి పైగా కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశారు. ప్రేక్షకుడు ఎంతగానో సినిమా కోసం ఎదురు చూశారు. దయచేసి బాయ్‌కాట్‌ చేయకండి’’ అని కరీనా కోరారు. 

Kareena kapoor: టార్గెట్‌ చేసి కిల్‌ చేస్తున్నారు!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement