సూర్య నమస్కారాలు చేసిన Kareena Kapoor.. ఎలా చేస్తావంటూ విపరీతంగా ట్రోలింగ్

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మంచి నటి మాత్రమే కాదు ఫిట్‌నెస్ ఫ్రీక్ అని కూడా తెలిసిందే. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా శరీరాన్ని బాగా మెయిన్‌టైన్ చేస్తూ ఎందరో కొత్తగా తల్లులైన వారికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. మొదటి కుమారుడు తైమూర్ పుట్టిన తర్వాత బాడీని మంచి షేప్‌లోకి తీసుకొని వచ్చిన ఈ తార.. అనంతరం హీరోయిన్‌గా నటనను కొనసాగించింది.


ఇటీవలే రెండో సంతానంగా జెహ్ కలగగా.. బాడీని మళ్లీ షేప్ చేసుకునే పనిలో పడింది కరీనా. అయితే తాజాగా పొద్దునే 108 సూర్య నమస్కారాలు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ముస్లిం అయిన నువ్వు సూర్య నమస్కారాలు ఎలా చేస్తావని క్రూరంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ముస్లింలు యోగా ఎలా చేయకూడదో అలాగే ఇది కూడా చేయకూడదని కొందరు విమర్శించారు. ఇది మరి అతిశయోక్తి.. ఆమె నిజంగా 108 సూర్య నమస్కారాలు చేసిందంటే నమ్మకం కలగట్లేదని మరికొందరు కామెంట్స్ పెట్టారు. చాలామంది ఆమె భంగిమల్లో, ఆసనాలలో తప్పులను ఎత్తి చూపారు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..


Advertisement