Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 05 Aug 2022 14:53:18 IST

Kareena Kapoor: షాహిద్ కపూర్‌ను కరీనా మాజీ భర్తగా సంబోధించిన కరణ్ జోహార్

twitter-iconwatsapp-iconfb-icon

చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ కరీనా కపూర్ (Kareena Kapoor). ‘జబ్ వి మెట్’, ‘తషాన్’, ‘త్రీ ఇడియట్స్’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. కెరీర్ తొలి నాళ్లల్లో షాహిద్ కపూర్‌ (Shahid Kapoor)తో ప్రేమాయణం కొనసాగించింది. ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్లకు ఈ జంట విడిపోయి ఎవరి దారిని వారు చూసుకున్నారు. ‘తషాన్’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్‌  (Saif Ali Khan)తో ప్రేమలో పడింది. అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) లో కరీనా తాజాగా పాల్గొంది. ఆమిర్ ఖాన్‌తో కలసి సందడి చేసింది. ఈ షోలో షాహిద్‌ను కరీనా మాజీ భర్తగా కరణ్ సంబోధించాడు. అనంతరం నాలుక కర్చుకున్నాడు. 


కరీనా కపూర్, షాహిద్ కపూర్ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అప్పట్లో వారి మధ్య బంధం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా కరీనా ‘కాఫీ విత్ కరణ్’ చాట్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కరీనాకు సంబంధించిన అనేక విషయాలను కరణ్ జోహార్ ప్రస్తావించాడు. ‘‘ఈ షోకు నువ్వు అనేక సార్లు హాజరయ్యావు. జీవితంలోని పలు దశలను చూశావు. నీ భర్త, మాజీ భర్త... ’’అని కరణ్ జోహార్ నాలుక కర్చుకున్నాడు. ‘‘మాజీ భర్త కాదు. మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో ఈ షోకు హాజరయింది’’ అని కరణ్ చెప్పాడు. అనంతరం క్షమాపణలు కూడా కోరాడు. కరీనా కపూర్ 2012లో సైఫ్‌అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కరీనా కపూర్ తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ లో నటించింది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, నాగచైతన్య, మోనాసింగ్ కీలక పాత్రలు పోషించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అమెరికన్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ‘లాల్ సింగ్ చడ్డా’ రూపొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement