కరక్కాయ, టీలలో కరోనాను నిరోధించే గుణం

ABN , First Publish Date - 2020-07-03T07:34:36+05:30 IST

కరక్కాయ, టీలలో కరోనాను నిరోధించే గుణం

కరక్కాయ, టీలలో కరోనాను నిరోధించే గుణం

న్యూఢిల్లీ, జూలై 2: కరక్కాయ, టీ నుంచి తీసిన పదార్థాలకు (గుజ్జు) కరోనా సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడే గుణం ఉందని ఐఐటీ-ఢిల్లీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. వీటిల్లో ఉండే గాల్లోటానిన్‌ అనే ప్రత్యేక పదార్థానికి కరోనాను నిరోధించే సామర్థ్యం ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఇందుకోసం ప్రొఫెసర్‌ అశోక్‌ కుమార్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం 51 ఔషధ మొక్కలను పరిశీలించింది. వైరస్‌ వ్యాప్తికి కీలకమైన పాలీప్రొటీన్‌ను నిర్వీర్యం చేసే సామర్థ్యమున్న మొక్కలను గుర్తించడమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగించారు. ఇందులో  వైరస్‌ ప్రతిరూపాన్ని నిరోధించడంలో టీ, కరక్కాయల్లోని గాల్లోటానిన్‌ పదార్థం ప్రభావవంతంగా పని చేసింది.

Updated Date - 2020-07-03T07:34:36+05:30 IST