కాపుకాచి.. దారిదోపిడీ

ABN , First Publish Date - 2022-05-21T04:46:01+05:30 IST

జాతీయ రహదారిపై కాపుకాచి, అటువైపు వచ్చిన కారును పంక్చర్‌ చేసి అందులో ప్రయాణించేవారిపై దాడి చేసి వారి వద్ద నున్న రూ.20వేలు నగదు, రెండు తులాల బంగా రు చైను, 3 సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై రూరల్‌ పోలీసులు కే సు నమోదు చేసిన వివరాల్లోకెళితే....

కాపుకాచి.. దారిదోపిడీ
గాయపడిన శివ వెంకటేశ్వర్రావు, తుకారాంరావు

కారు పంక్చర్‌ చేసి, కర్రలతో దాడి 

బంగారు చైను, నగదు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన దుండగులు

బాధితులు అనంతపురం వాసులు

కేసు నమోదు చేసిన పోలీసులు 

భయాందోళనల్లో ప్రజలు

ప్రొద్దుటూరు క్రైం, మే 20: జాతీయ రహదారిపై కాపుకాచి, అటువైపు వచ్చిన కారును పంక్చర్‌ చేసి అందులో ప్రయాణించేవారిపై దాడి చేసి వారి వద్ద నున్న రూ.20వేలు నగదు, రెండు తులాల బంగా రు చైను, 3 సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై రూరల్‌ పోలీసులు కే సు నమోదు చేసిన వివరాల్లోకెళితే....

 అనంతపురం పట్టణం వేణుగోపాల్‌నగర్‌ వాసి వెతంగి తుకారాంరావు ఆయుర్వేద ఫార్మసీ యజమాని. ఇతను తన అన్న శివ వెంకటేశ్వర్రావుతో కలిసి ప్రొద్దుటూరులోని ఇసుకదిన్నెల్లో నివాసముంటున్న అంజి కుమారుడు (మూగ చెవిటి బా లుడు)కి ఆయుర్వేద మందు ఇచ్చేందుకు కారులో గురువారం సాయంత్రం బయలుదేరారు. బాలుని కి మందు ఇచ్చి, తిరిగి కారులో  రాత్రి 11 గంటల కు అనంతపురానికి బయలుదేరారు.

మార్గమధ్యలో చౌడూరు దాటాక బైపా్‌సలో కారు ముందు టైరు పంక్చర్‌ అయింది. దీంతో ప్రయాణిస్తున్న వారు కిందికి దిగి టైరు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వెనుక నుంచి కొందరు యువకులు తమ పై రాళ్లు విసురుతూ వచ్చి కర్రలతో దాడిచేసి తమ వద్ద నున్న రూ.20వేలు నగదు, రెండు తులాలు బంగారు చైను, మూడు సెల్‌ఫోన్లు దోచుకుని వెళ్లా రు. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూ రు జిల్లా ఆస్పత్రిలో చేరారు. సమాచారం అందుకు న్న రూరల్‌ ఎస్‌ఐ సంజీవరెడ్డి ఘటనా స్థలం చేరుకుని పరిశీలించారు. దుండగులు ఐదుగురని, అం తా 25 ఏళ్లలోపు వారేనని, తెలుగు, ఉర్దూ మాట్లాడుతున్నారని బాధితులు తెలిపారు. దోపిడీ వివ రాలు తుకారాంరావు రూరల్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-05-21T04:46:01+05:30 IST