కాపులను విస్మరిస్తున్న జగన్‌

ABN , First Publish Date - 2021-10-25T05:28:47+05:30 IST

కాపుల ఓట్లతోనే సీఎం అయిన జగన్‌ నేడు ఆ కాపులనే విస్మరిస్తున్నారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు యిర్రింకి సూర్యారావు, నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మల్లినీడి బాబి అన్నారు.

కాపులను విస్మరిస్తున్న జగన్‌
సీఎంకు రాసిన పోస్టుకార్డులతో కాపు సంక్షేమ సేన నాయకులు

కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు యిర్రింకి సూర్యారావు


ఆకివీడు, అక్టోబరు 24 : కాపుల ఓట్లతోనే సీఎం అయిన జగన్‌ నేడు ఆ కాపులనే విస్మరిస్తున్నారని కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు యిర్రింకి సూర్యారావు, నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మల్లినీడి బాబి అన్నారు.  స్థానిక సంగీత థియేటర్‌ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కాపు సంక్షేమ సేన ఉండి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ అధికారం చేపట్టిన తరువాత కాపులను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం కాపులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఏడాదిలో కాపు సంక్షేమానికి రూ.2 వేల కోట్లు అన్న జగన్‌ నేటికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాపులను బీసీలో చేర్చాలన్నారు. కాపుల పోస్టు కార్డుల ఉద్యమంపై సీఎం జగన్‌ స్పందించకపోతే మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు కొటికలపూడి తాతాజీ, చిరంజీవి సత్యనారాయణ, కుచ్చు శివరామకృష్ణ, తోట నాగబాబు, వలవల శేషు, కందుల అప్పారావు, గవర అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:28:47+05:30 IST