కాపు ముఖ్యనాయకుల భేటీ.. ఐక్యవేదిక ఏర్పాటుకు నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-24T03:20:54+05:30 IST

కాపు ముఖ్యనాయకులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. విజయవాడలో భేటీ కావాలని ముందుగా నిర్ణయించారు. అయితే..

కాపు ముఖ్యనాయకుల భేటీ.. ఐక్యవేదిక ఏర్పాటుకు నిర్ణయం

అమరావతి: కాపు ముఖ్యనాయకులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.  విజయవాడలో భేటీ కావాలని ముందుగా నిర్ణయించారు. అయితే కరోనా థర్డ్ వేవ్‎తో వర్చువల్‎లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 16 మంది నేతలు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగింది. 


అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని మెజార్టీ సభ్యులు సూచనలు చేశారు. అన్ని కులాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. దళితులు, వెనకబడిన వర్గాల ముఖ్యనేతలతో టచ్‎లో ఉన్న కాపు ముఖ్యనేతలు ఫిబ్రవరి రెండవ వారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. విజయవాడలో సమావేశం అయ్యేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపారు. 


ఆ సమావేశంలో కోర్ కమిటీ వేయాలని సూచనలు చేశారు. అయితే ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న కాపు నేతలు దూరంగా ఉన్నారు.  మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామ్మోహాన్, ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు, ముద్రగడ్డ అనుచరుడు ఆరేటి ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు. 



Updated Date - 2022-01-24T03:20:54+05:30 IST