కాకినాడ: కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చెయ్యాలంటూ రాసిన లేఖలపై వస్తున్న విమర్శలపై ప్రజలకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య రాజకీయాల్లో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించటం, పనిచేసే వారిని దగా కోరులు..దొంగలు అని చెప్పించడం పరిపాటి అయిందని విమర్శించారు. కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చెయ్యాలని రాసిన లేఖపై సోషల్ మీడియాలో తనను బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టింగులకు బెదిరిపోయి పారిపోనని... బంతిని ఎంతగట్టిగా కొడితే అంత స్పీడుగా పైకి లేస్తానని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి