హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కపిల్ శర్మ

బాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకుని, ప్రేక్షకులకు కితకితలు పెట్టించిన వాడు కపిల్ శర్మ. తాజాగా అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. నందితా దాస్ దర్శకత్వం వహించబోయే ఒక సినిమాతో అతడు బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయబోతున్నాడు. గత కొంత కాలంగా కపిల్ శర్మ, నందితా దాస్ ఆ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. 


‘‘ నందితా దాస్, కపిల్ శర్మ కలిసి ఒక ప్రాజెక్టు కోసం పనిచేయబోతున్నారు. ఇద్దరు భిన్న ధ్రువాలకు చెందినవారు. తమ సరిహద్దులను దాటి పనిచేయాలని వారు ఆలోచిస్తున్నారు. సినిమాకు సంబంధించిన చర్చలు చివరి దశకు వచ్చాయి. నందితా దాస్ ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. అపలాజ్ ఎంటర్ టైన్ మెంట్‌కు చెందిన  సమీర్ నాయర్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు ’’ అని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి చెప్పారు. గతంలో నందితా దాస్ మాంటో అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఆ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్ర పోషించారు. ఆ మూవీ 2018లో విడుదలైంది.  

Advertisement