సరస్వతీదేవిగా కన్యకాపరమేశ్వరి!

ABN , First Publish Date - 2022-10-03T06:01:30+05:30 IST

వన్‌టౌన్‌ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

సరస్వతీదేవిగా కన్యకాపరమేశ్వరి!
సరస్వతిదేవి అలంకరణలో కన్యకాపరమేశ్వరి

మహారాణిపేట, అక్టోబరు 2: . వన్‌టౌన్‌  కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కన్యకాపరమేశ్వరి అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా  అమ్మవారి ఆలయంలో మూల విరాట్‌కు పాలు,. పెరుగు, గంధం వంటి వాటితోపాటు 108 రకాల సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో  పూజలు నిర్వహించారు.  అనంతరం ఆలయ గర్భగుడిలో నీటి కొలను ఏర్పాటు చేసి సరస్వతీ దేవీగా వివిద రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. సుమారు 1500 మంది విద్యార్థులతో సామూహికంగా సరస్వతీ పూజ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా సోమవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.                       


Updated Date - 2022-10-03T06:01:30+05:30 IST