Uttar pradesh: హెలికాప్టర్ నుంచి కన్వరీలపై పూలవర్షం

ABN , First Publish Date - 2022-07-25T23:33:33+05:30 IST

కన్వరీల (Devotees of Lord shiva) యాత్రకు ఉత్తరప్రదేశ్‌లో అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల..

Uttar pradesh: హెలికాప్టర్ నుంచి కన్వరీలపై పూలవర్షం

లక్నో: కన్వరీల (Devotees of Lord shiva) యాత్రకు ఉత్తరప్రదేశ్‌లో అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆదేశాల మేరకు అధికారులు కన్వరీల యాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, అన్నపానీయాలకు లోటు లేకుండా చూస్తున్నారు. ఘజియాబాద్‌తో సహా పలు చోట్ల కన్వరీలపై జనం, అధికారులు పూలజల్లులు కురిపిస్తున్నారు. సీనియర్ అధికారులు హెలికాప్టర్ల నుంచి, రోడ్డు మార్గం నుంచి క్లేన్ల‌ ద్వారా పూలతో కన్వరీలను ముంచెత్తుతున్నారు. స్వయంగా ముఖమంత్రే ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సోమవారంనాడు ఏరియల్ సర్వే జరిపారు.


ఘజియాబాద్‌లోని మురనగర్ ప్రాతంలో ఎస్‌డీఎం, ఏడీఎంలతో సహా సీనియర్ పోలీసు అధికారులు రోడ్లపైకి వచ్చి కన్వరీలపై పూలవర్షం కురిపించారు. కన్వరీలపై పూలు చల్లేందుకు భారీ క్రేన్‌ను ఉపయోగించారు. కన్వరీల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కన్వరీలు తమ యాత్రలో భాగంగా హరిద్వార్, ఉత్తరాఖండ్‌లో గంగా జలాలను సేకరించి తమ స్వస్థలాల్లోని శివాలయాల్లో అభిషేకాలు చేస్తారు.


కాగా, షహరాన్‌పూర్, ముజఫర్‌నగర్‌లోనూ కన్వరీలకు పువ్వులతో స్వాగతం పలికేందుకు ప్లాన్ చేశారు. సీఎం ఆదేశాలతో హెలికాప్టర్లను సిద్ధం చేశారు. అయితే, వాతావరణం సరిగా లేకపోవడంతో చివరినిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసారు. రిషీకేశ్ నుంచి గంగా జలాలలను తీసుకుని ఇంటికి వెళ్తున్న కన్వరీలపై శనివారంనాడు కూడా పలు చోట్ల పూలవర్షం కురిపించారు.

Updated Date - 2022-07-25T23:33:33+05:30 IST