Kanwar yatra.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-07-17T23:52:24+05:30 IST

గంగాజలాన్ని ట్యాంకర్లలో తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. కరోనా కారణంగా కన్వర్ యాత్ర రద్దయిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Kanwar yatra.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ప్రకటన

హరిద్వార్: గంగాజలాన్ని ట్యాంకర్లలో తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. కరోనా కారణంగా కన్వర్ యాత్ర రద్దయిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘గంగాజలం కావాలని రాష్ట్రాలు కోరితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇందుకు  పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. హరిద్వార్ నుంచి ట్యాంకర్ల ద్వారా గంగాజలాన్ని తీసుకెళ్లేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తాం’’ అని అదనపు చీఫ్ సెక్రెటరీ ఆనంద్ వర్థన్ తాజాగా పేర్కొన్నారు. కన్వర్ యాత్రలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి శివభక్తులు హరిద్వార్‌కు చేరుకుంటారు. అక్కడ సేకరించిన గంగాజలంతో తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో ముక్కంటికి అభిషేకాలు చేస్తారు. జులై 25న ప్రారంభం కావాల్సిన ఈ యాత్రను ప్రభుత్వం కరోనా కారణంగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్ల ద్వారా గంగాజలాన్ని తరలించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతిచ్చింది.

Updated Date - 2021-07-17T23:52:24+05:30 IST