‘కనుమా’.. జల్లికట్టు

ABN , First Publish Date - 2022-01-17T07:44:33+05:30 IST

‘కనుమా’.. జల్లికట్టు

‘కనుమా’.. జల్లికట్టు

కనుమ పండుగ సందర్భంగా ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, అరిగిలవారిపల్లెలు జల్లికట్టు ఆటతో జనసంద్రంగా మారాయి. చిన్నాపెద్దా.. ఆడమగా.. అందరూ జల్లికట్టును చూడ్డానికి రావడంతో ప్రధానవీధులు కిక్కిరిసిపోయాయి. రంకెలేస్తూ పరుగుతీసిన గిత్తలను యువకులు నిలువరిస్తూ, వాటి కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించుకునేందుకు పోటాపోటీగా ముందుకొచ్చారు. ఈ క్రమంలో కొంతమంది గాయపడ్డారు. 

- చంద్రగిరి

Updated Date - 2022-01-17T07:44:33+05:30 IST