May 4 2021 @ 23:35PM

‘వకీల్‌ సాబ్’.. కంటిపాప వీడియో సాంగ్ విడుదల

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప్ర‌పంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేశారు. ఓటీటీలో కూడా ఈ చిత్రం భారీ స్పందనను రాబట్టుకుంటోంది. మంగళవారం ఈ చిత్రంలోని ‘కంటి పాప కంటిపాప‌..’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసింది. హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఇది. 


‘‘కంటి పాప కంటి పాప.. చెప్ప‌నైన లేదే

నువ్వంత‌లా అలా ఎన్ని క‌ల‌లు క‌న్నా...

కాలి మువ్వ కాలి మువ్వ స‌వ్వ‌డైన లేదే, 

నువ్వెన్ని నాళ్లుగా..వెంట తిరుగుతున్నా..’’ అంటూ హీరోయిన్‌పై హీరో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్న ఈ పాటకు ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్, దీపు మరియు థమన్ ఆలపించారు.