కంటి వెలుగులు ఏవీ?

ABN , First Publish Date - 2022-05-03T05:46:55+05:30 IST

సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి గ్రహణం పట్టింది. కంటి సమస్యలున్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమాన్ని 2018లో ఆగస్టు 15న ప్రారంభించారు. ఉచితంగా కంటి అద్దాలు, అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయాలని నిర్ణయించారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 4,53,980 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. 1,16,574 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 30,835 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. 60 మందికి మాత్రమే ప్రభుత్వ, పైవ్రేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌చేసి శస్త్రచికిత్సలు నిర్వహించారు. మిగిలిన వారంతా నాలుగేళ్లుగా తమవంతు కోసం వేచి చూస్తున్నారు. కరోనా కారణంగా మధ్యలో కొద్దిరోజులు శస్త్ర చికిత్సలు నిర్వహించలేదు. ఆ తరువాత పరిస్థితి మామూలుగా మారినా ఆపరేషన్ల ఊసే ఎత్తడం లేదు.

కంటి వెలుగులు ఏవీ?

జిల్లాలో 4,53,980 మందికి పరీక్షలు

1,16,574 మందికి కంటి అద్దాల పంపిణీ

30,835 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తింపు

60 మందికి మాత్రమే సర్జరీలు పూర్తి

మూడున్నరేళ్లుగా 30,775 మంది ఎదురుచూపులు


సిద్దిపేట టౌన్‌, మే 2: సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి గ్రహణం పట్టింది. కంటి సమస్యలున్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమాన్ని 2018లో ఆగస్టు 15న ప్రారంభించారు. ఉచితంగా కంటి అద్దాలు, అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయాలని నిర్ణయించారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 4,53,980 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. 1,16,574 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 30,835 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. 60 మందికి మాత్రమే ప్రభుత్వ, పైవ్రేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌చేసి శస్త్రచికిత్సలు నిర్వహించారు. మిగిలిన వారంతా నాలుగేళ్లుగా తమవంతు కోసం వేచి చూస్తున్నారు. కరోనా కారణంగా మధ్యలో కొద్దిరోజులు శస్త్ర చికిత్సలు నిర్వహించలేదు. ఆ తరువాత పరిస్థితి మామూలుగా మారినా ఆపరేషన్ల ఊసే ఎత్తడం లేదు.


మూలనపడ్డ కంటి అద్దాలు

కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు అందజేసిన కంటి అద్దాలు అందజేసి మూడున్నరేళ్లు దాటింది. అప్పట్లో ఇచ్చిన అద్దాల గడువు తీరిపోయింది. కొందరికి సమస్య పెరిగింది. అప్పుడు ఇచ్చిన అద్దాలు దాదాపు పనికిరాకుండా పోయాయి. అయినా కొందరు అవే అద్దాలను వాడుతుండటంతో కంటిచూపు సమస్య తీవ్రమవుతున్నది. దీంతో పలువురు పైవ్రేటు ఆస్పత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. 


ఈ ఏడాదైనా జరిగేనా?

గత నాలుగేళ్ల నుండి కంటి వెలుగు పథకంలో భాగంగా శస్త్ర చికిత్స నిర్వహించుకునేందుకు ఉవ్విల్లూరుతున్న నిరుపేదలు, వృద్ధులకు ఈ ఏడాదైనా స్పష్టంగా చూపు కనిపించేందుకు ప్రభుత్వం శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుందా, లేదా అనే భావనతో ఉన్నారు. ప్రభుత్వం విడతలవారీగా నైనా ప్రభుత్వ, పైవ్రేట్‌ ఆసుపత్రులలో శస్త్ర చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిధులు సమకూర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Read more