Hostel :బాలికలు స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ...ముగ్గురి అరెస్ట్
ABN , First Publish Date - 2022-10-01T16:50:57+05:30 IST
బాలికల వసతి గృహంలోని బాత్రూంలలో బాలికలు(Girl students) స్నానం చేస్తుండగా అశ్లీల వీడియోలు తీసిన కేసులో...
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): బాలికల వసతి గృహంలోని బాత్రూంలలో బాలికలు(Girl students) స్నానం చేస్తుండగా అశ్లీల వీడియోలు తీసిన కేసులో(obscene video case) పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్(Kanpur) నగరంలోని బాలికల వసతి గృహంలో యజమాని బాలికలు స్నానం చేస్తుండగా అశ్లీల వీడియోలు(obscene video) తీశారు. అశ్లీల వీడియోలున్న ఫోన్లను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో ముగ్గురు నిందితులను అరెస్టు(arrested) చేశామని కాన్పూర్ జాయింట్ సీపీ ఆనంద్ ప్రకాష్ తివారీ చెప్పారు.
హోటల్ యజమాని పోలీసు అధికారి అంటూ వార్డెన్ దర్యాప్తులో చెప్పారు. దీంతో విచారించగా పోలీసు పేరిట హాస్టల్ యజమాని అశ్లీల వీడియోలు చిత్రీకరించారని తేలింది. బాలికలు స్నానం చేస్తున్న వీడియోలు హాస్టల్ యజమాని ఫోనులో ఉన్నా వార్డెన్ అయిన మహిళ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది.