కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఒమైక్రాన్ వేరియెంట్ టెన్షన్‌తో డిప్రెషన్‌కు గురైన ఓ డాక్టర్ తన భార్యాపిల్లలను చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. కాన్పూర్ నగరంలోని కళ్యాణ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టెన్షన్‌తో డిప్రెషన్‌కు గురయ్యాడు. డాక్టర్ తన ఇంట్లో శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలను చంపి పారిపోయాడు. డిప్రెషన్లో తాను భార్య పిల్లలను హత్య చేశానని పరారీలో ఉన్న డాక్టర్ సోదరుడికి వాట్సాప్‌లో సందేశమిచ్చాడు.ఈ దారుణ ఘటనపై కాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సాక్షాత్తూ డాక్టరే భార్యాపిల్లలను హత్య చేసిన ఘటన కాన్పూర్ నగరంలో సంచలనం రేపింది.పరారీలో ఉన్న నిందితుడైన డాక్టర్ కోసం గాలిస్తున్నామని కాన్పూర్ పోలీసు కమిషనర్ చెప్పారు.