రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి టీకా

ABN , First Publish Date - 2021-06-24T15:10:36+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాన్పూర్ దేహాట్ నగరానికి చెందిన రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి డోసు టీకా....

రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి టీకా

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాన్పూర్ దేహాట్ నగరానికి చెందిన రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి డోసు టీకా వేశారు.పిల్లలపై క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతితో భారత్ బయోటెక్ పరీక్షలు ప్రారంభించింది. కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్న బాలిక కాన్పూర్ దేహాట్ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యుడి కుమార్తె కావడం విశేషం. 2 నుంచి 6 సంవత్సరాల వయసు గల ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురకు కొవిడ్ టీకాలు వేశారు. 


కాన్పూర్ ప్రాఖర్ ఆసుపత్రిలో పిల్లలకు కొవిడ్ టీకాలు వేసి వారి హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేశారు. ఢిల్లీ ఎయిమ్స్, పాట్నాలోని పలు ఆసుపత్రుల్లో పిల్లలపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. కోవాక్సిన్ మూడవ దశ ట్రయల్ డేటాను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆమోదించింది.పిల్లలపై మూడు దశల ట్రయల్స్ పూర్తి అయిన తర్వాత పిల్లలకు కోవాక్సిన్ డేటా సెప్టెంబరు నాటికి లభిస్తుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. 

Updated Date - 2021-06-24T15:10:36+05:30 IST